Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 03సంగారెడ్డి జిల్లా,పటాన్‌చెరు నియోజకవర్గ

పరిధిలోని నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ మహా చండీ సాహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మరియు ఆయన సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ, “ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడంతో పాటు, సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు. దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సేవకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు మా పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ మాజీ సర్పంచ్ శివానందం, పటాన్చెరు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లగొని విక్రమ్ గౌడ్, ఎల్లగొని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.