

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తుందని, బాపు చూపిన బాటలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వాడ, వాడల, గ్రామ, గ్రామాన, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర, ప్రారంభం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే మూడు రంగుల రేషన్ కార్డు పంపిణీ సైతం లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. తదనంతరం, జమ్మికుంట పట్టణంలోని కేశపురం లో ఏఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో, ఒడితల ప్రనవ్ బాబు తో, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తదనతారం పతకాల అనిల్ అధ్యర్యంలో, ముఖ్య అతిధి గా వచిన్న ప్రణవ్ బాబు, కేశవపూర్ గ్రామంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పొనగంటి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి, గూడెపు సారంగపాణి,పింగిలి రాకేష్, రవి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
