

ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి చంపిన కసాయితల్లి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణం
చాకచక్యంగా కేసును చేదించిన అమీన్పూర్ పోలీసులు
పోలీసుల అదుపులో వివాహిత రజిత శివ
జనం న్యూస్ సంగారెడ్డి, ఏప్రిల్
3 వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కసాయి తల్లి తన ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండ చేసి చంపేసినా ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో చోటుచేసుకుంది. బుధవా రం సంగారెడ్డి జిల్లాఎస్ పి పరీతోష్ పంకజ్ పత్రిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తల కొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామానికి చెందిన చెన్నయ్య, రజిత అలియాస్ లావణ్య దంపతులు. ప్రస్తుతం అమీన్పూర్ పరిధి లోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) ముగ్గురు సంతానం. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పని చేస్తుండగా రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నది. గత ఆరు నెలల క్రితం రజిత తన పదో తరగతి స్నేహితులు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలు సుకున్నారు. అప్పటి నుంచి తన పదో తర గతి మిత్రుడు నల్గొండ జిల్లా గోడుకొండ్లకు చెందిన శివ(30)తో రజితకు స్నేహం మరిం తగా పెరిగి, వివాహేతర సంబంధానికి దారీ తీసింది. శివకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా రజితకు, చెన్న య్యకు మధ్య 20 ఏళ్ల పెద్దవాడై ఉండటం తో మొదటి నుంచీ రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. శివను పెళ్లి చేసుకుంటే ఆనందం గా ఉండవచ్చని రజిత భావించింది. తనను పెళ్లి చేసుకోవాలని శివను అడగగా పిల్లలు లేకుండా ఒంటరిగా వస్తే పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో పిల్లల అడ్డు తొల గించుకోవాలని రజిత నిర్ణయించుకుంది. మార్చి 27న రాత్రి తన భర్త భోజనం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకుని చందాన గర్ వెళ్లాడు. అదే అదునుగా భావించిన రజి త మొదట పెద్ద కొడుకు సాయికృష్ణను, ఆ తర్వాత కూతురు మధుప్రియను, అటు తర్వాత చిన్న కొడుకు ముక్కు మూతిపై టవల్ వేసి చేతితో గట్టిగా అధిమి పట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపింది. అక్రమ సంబంధం కోసం కుట్ర పన్ని పిల్లల్ని చంపిన రజితను, ప్రోత్స హించిన శివను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్టు జిల్లాఎస్పీ వెల్లడించారు.