

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజి పర్సనల్స్ ఎస్.హరికృష్ణ, ఐ.పి.ఎస్.
జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఏప్రిల్ 2న జిల్లా పోలీసు
కార్యాలయంలో నిర్వహించిన మాసాంతర నేర సమీక్షా సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజీ పర్సనల్స్ ఎస్.హరికృష్ణ, ఐపిఎస్., ముఖ్య అతిధిగా హాజరై, సిసిటిఎన్ఎన్ ద్వారా దర్యాప్తులో ఉన్న గ్రేప్ కేసులను సమీక్షించారు. జిల్లాకు విచ్చేసిన ఐజి హరికృష్ణకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత స్వాగతం పలకగా, పోలీసుల నుండి ఐజి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఐజి ఎస్.హరికృష్ణ మాట్లాడుతూ – వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదవుతున్న కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సి.సి.టి.ఎన్.ఎస్. (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగు నెట్వర్కు అండ్ సిస్టం)లో నిక్షిప్తం చేయాలన్నారు. భవిష్యత్తులో అన్ని రివ్యూ మీటింగులకు సంబంధించిన సమాచారాన్ని సి.సి.టి.ఎస్.ఎస్. ద్వారానే తీసుకొని,
సమీక్షిస్తున్నామన్నారు. కావున, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు సి.సి.టి.ఎన్.ఎస్.పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలీసుశాఖలో సి.సి.టి.ఎన్.ఎస్.కు మంచి ప్రాధాన్యత ఉందని, రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రతీ రోజూ వివిధ జిల్లాల్లో నమోదవుతున్న కేసులు, ఆయా కేసుల దర్యాప్తులో సాధించిన పురోభివృద్ధిని పర్యవేక్షిస్తున్నామన్నారు. అనంతరం, వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన గ్రేవ్ కేసులను ఐజి హరికృష్ణ సి.సి.టి.ఎన్.ఎస్. ద్వారా సమీక్షించి, అధికారులకు దిశా నిర్దేశం చేసారు. సి.సి.టి.ఎన్.ఎస్. వినియోగించుటలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని వస్తే, వాటిని సమీక్షించి, సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, ఇబ్బందులను తొలగించేందుకు
కృషి చేస్తానని ఐజి హరికృష్ణ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – పోలీసు స్టేషను పరిధిలో ఏదైనా నేరం నమోదైనపుడు సంబంధిత అధికారులు సంఘటనా స్థలంకు వీలైనంత తక్కువ సమయంలో చేరుకోవాలని, నేర స్థలంను క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసి, కేసులను చేధించేందుకు అవసరమైన సాంకేతిక ఆధారాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషను పరిధిలో ఉన్న ప్రముఖులు, దేవుళ్ళ విగ్రహాలపై నిఘా పెట్టాలని, విగ్రహాలపై ఆకతాయిలు దాడులు చేయకుండా స్థానికులతో విగ్రహాల రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. లేడీస్ హాస్టల్స్ లో భద్రత ఏర్పాట్లును సంబంధిత పోలీసు అధికారులు పర్యవేక్షించాలని, హాస్టలకు ప్రహరీ, సిసి కెమెరాలు, వాచ్మెన్ ఉండే విధంగా యాజమాన్యాలు చర్యలు చేపట్టే విధంగా చూడాలన్నారు. మిస్సింగు కేసుల్లో అలసత్వం వద్దని, ఫిర్యాదు అందిన వెంటనే కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషనుల్లో వుమెన్ హెల్ప్ డెస్క్ లు/రిసెప్షన్ అధికారులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, వారికి అవసరమైతే ఫిర్యాదు వ్రాయుటలో సహాయ వడాలన్నారు. ఫింగర్ ప్రింట్స్ లైవ్ స్కానర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, అనుమానస్పద వ్యక్తుల వేలిముద్రలను తీసి, వారి నేర చరితను గుర్తించాలన్నారు. హిస్టరీషీట్లు కలిగిన వ్యక్తులు ప్రవర్తన, నడవడిక, నేర ప్రవృత్తిపై నిఘా పెట్టాలని, కౌన్సిలింగు ఇవ్వాలని, వేరే ప్రాంతాల్లో నివసిస్తూ, కౌన్సిలింగుకు హాజరుకాని వ్యక్తుల హిస్టరీ షీట్లును ఆయా పోలీసు స్టేషన్లుకు బదిలీ చేయాలన్నారు. హత్య, రేప్, గంజాయి, రోబరీ, దొంగతనాలు, పోక్సో కేసుల్లో నిందితులు, శిక్షలు పడిన వ్యక్తుల ప్రవర్తనపై నిఘా పెట్టేందుకు వెంటనే వారిపై హిస్టరీ షీట్లును ప్రారంభించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
మహిళలపై దాడులను నియంత్రించేందుకు ప్రారంభించిన శక్తి టీమ్స్ మరియు సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలోని స్కూల్స్ ఏక్టివ్ గా ఉండే తరగతి విద్యార్థులతో శక్తి వారియర్స్, వారిలో చురుకుగా ఉన్న విద్యార్థినుల తో లీడ్ వారియర్స్ గ్రూపులను ఏర్పాటు చేసి, వారికి మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, పోలీసుల సహాయంను పొందేందుకు ఉపయోగపడే అత్యవసర ఫోను నంబర్లు పట్ల అవగాహన కల్పించాలన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర మతాలకు చెందిన ప్రార్థన స్థలాల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ-సాక్ష్య, ఈ-బీట్ యాప్లను రాష్ట్ర పోలీసుశాఖ అందుబాటులోకి తేనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. 112 ఫోను కాల్స్ వచ్చే సమయంలో సంఘటన స్థలంకు పోలీసు స్టేషన్లుకు ఇప్పటికే అందించిన ట్యాబ్లను తమ వెంట తీసుకొని వెళ్ళాలన్నారు. గంజాయిని
యంత్రణలో భాగంగా వినియోగం, విక్రయం, అమ్మకాలు చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్టీపిఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎన్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకుగల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసి, గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. వివిధ పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్అదాలత్ లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, సిసిటిఎన్ఎస్ లో కేసుల వివరాలను సకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్. రాఘవులు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.