Listen to this article

జనం న్యూస్ 03 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం, బూసాయవలసలో SSD కన్వెన్షన్ హాల్ యందు శ్రీ గంటా తిరుపతిరావు గారు కుమారిని వివాహ వేడుకకు హాజరైన గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు.. ఈరోజు ఉదయం సుమారు గం07:45 లకు వివాహ వేదికకు చేరుకున్న స్పీకర్ గారు వధూవరులని ఆశీర్వదించి, అనంతరం అక్కడే అల్పాహారం చేశారు..అనంతరం, మీడియా సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంద్రకు చేస్తున్న అభివృద్ధిని గురించి, పోలవరం ప్రాజెక్టు పనులను గురించి వివరించారు.. అలాగే, వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించలేమని విలేకరులు అడిగిన ప్రశ్నకు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొండపల్లి కొండలరావు గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గేదెల శ్రీనివాస్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు, నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు శ్రీ కంది చంద్రశేఖర్ గారు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మడక తిరుపతి గారు, రామభద్రపురం మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ కరణం భాస్కరరావు గారు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు..!!