Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

హైందవ పరిరక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు : ప్రజా సంఘాల నాయకులు.

ఛత్రపతి శివాజీ తన ప్రజల కోసం నిరంతరం కృషి చేశారని, సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదని స్వతహాగా ధైర్యవంతుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న మరణించారని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు.గురువారం పట్టణంలోని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శివాజీ తన చతురమైన వ్యూహాలు, శౌర్యం, వీరత్వం,పరిపాలనా నైపుణ్యాలుగుర్తుండిపోతాయన్నారు.ముంబైలోని అంతర్జాతీయవిమానాశ్రయానికి సమీపంలో శివాజీ మహారాజ్ విగ్రహలను ప్రభుత్వాలు నిర్మించాయి అంటే ఆయన చేసిన పోరాటాల నిదర్శనం అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. అప్పటి నుండి, ఏప్రిల్ 3న,శివాజీ వర్ధంతిని ప్రతి సంవత్సరం పుకుంటామని,ఛత్రపతి శివాజీ మహారాజ్ శౌర్యం, వీరత్వం, అతని పరిపాలనా నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన రాజుగా పేరు పొందారు. ఆయన చేసిన పోరాటాలను ఈతరం యువత జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బి.శ్రీను నాయక్, కౌన్సిలర్ కోటా నాయక్,కంభంపాటి దానియేలు, బి.చిన్న నాయక్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, పుట్టా వెంకట బుల్లోడు, ఇస్లావతు మంగ నాయక్ , చెన్నకేశవుల రాంబాబు కె.నాగ రాజు, సి.హెచ్ హరిప్రసాద్, బి.వెంకటేశ్ నాయక్,డి. గోపి నాయక్,కంచర్ల శ్రీనివాసరావు, బిరుదు లక్ష్మణ,తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.