

ఆర్ఐ మల్లేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వై మల్లారెడ్డి,
జనం న్యూస్, ఏప్రిల్ 03,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,చాప్ట కే, రాజారామ్ తాండ లో గురువారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యన్ని లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి,తాజా మాజీ సర్పంచ్ పల్లవి పరశురాం,మాట్లాడుతు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యంని నూతన సంవత్సరం ఉగాది కానుకగా ఇవ్వడం సంతోషం అని నెటీ నుంచి ప్రతి ఒక్కరికి పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం అన్నాన్ని భూజించాలనే ఉద్దేశంతో ఈ బియ్యన్ని పంపిణి చేస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని,ప్రతి ఒక్కరికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,మహిళ మణులకు బస్ ప్రి, రెండు లక్షల రూపాయల రుణమాఫీ,అలాగే రైతు భరోసాను, కొనసాగిస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలో రాగానే, ఉద్యోగలు భర్తీ,ఎస్సి రిజర్వేషన్ కు మద్దత్తు గా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం, బీసీల రిజర్వేషన్ పెంపుకు మద్దత్తు తెలపడం జరిగింది.అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సావిత్రి మనోహర్, జాదవ్ రవీందర్,తాజా మాజీ సర్పంచ్లు పల్లవి పర్సురామ్,గడ్డపు మనోహర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, కోటగిరి మనోహర్,తోమ్రే బాలప్ప,తట్టి వీరేశం, ఆకుల రాములు,ఖిరు నాయక్, ఉప సర్పంచ్ ముంగీలాల్,లక్సమన్, మణిరం, బాబు షింగ్, ధుమ, జాదవ్ బాబు షింగ్,మతురా కిషన్,అశోక్, రాజు రామ్ కిషన్, జాదవ్ గోపాల్, నాందేవ్, రామ్ కిషన్,అశోక్,శివాజీ రావు,మాణిక్,మల్ శెట్టి,నగొండ, రాజుపాటిల్,హన్మంతు తదితరులు పాల్గొన్నారు.