

జనం న్యూస్ 04ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యువ వికాస్ దరఖాస్తుల సహాయ కేంద్రం ను ఏర్పాటుచేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల పంచాయతీ అధికారి మహేందర్ , మండల ఏఈ పిఆర్ షంషీర్ అలీ , కార్యాలయ సిబ్బంది మరియు దరఖాస్తుదారులు పాల్గొన్నారు.