

భరతనాట్యం చేసిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం
జనం న్యూస్ జనవరి 15 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్యగార్ల సహకారంతో మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా భరతనాట్య గురువు విష్ణు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వారి శిష్యులు ప్రదర్శించిన భరతనాట్యం వచ్చిన భక్తులకు కనుల విందుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోందని, మన దేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగంగా ఉండి బిన్న సంస్కృతులతో కూడిన మన సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో మన సంస్కృతిని మర్చిపోకుండా చిన్నపిల్లలను శాస్త్రీయ నిత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మరియు నేర్పిస్తున్న వారి నాట్య గురువు విష్ణు కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్యం చేసిన చిన్నారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి సహకారంతో క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య మారుతి యాదవ్ ప్రోత్సాహ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బర్ల సత్తయ్య, రాపెల్లి రమేష్, సన్నీ,ఆకారపు రేణుకా, రెండ్ల శ్రీనివాస్,సామల సతీష్ మరియు
గ్రామ ప్రజలు పాల్గొన్నారు