Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 03 సంగారెడ్డి జిల్లా, పటాన్ చేరు నియోజకవర్గం

పరిధిలోని రుద్రారం గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపీఓ హరి శంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తోషిబా పారిశ్రామిక యజమాన్యం సహాయ సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు, అంగన్వాడిలకు, ప్రాథమిక హెల్త్ సెంటర్లకు కావలసిన సామాగ్రిని అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఇరువురు మాట్లాడుతూ తోషిబా మేనేజింగ్ డైరెక్టర్ మోటో, జనరల్ మేనేజర్ రామకృష్ణ వీరి సహకారంతో సిఎస్ఆర్ నిధుల సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో 22 సీసీ కెమెరాలను, పిల్లలు కూర్చోడానికి స్కూల్ బల్లలు, కంప్యూటర్స్, అంగన్వాడి సెంటర్లకు వంట సామాగ్రిని, ప్రాథమిక హెల్త్ సెంటర్ కు త్రాగు నీరు శుద్ధి చేసే యంత్రాన్ని అందజేశారు.విద్యార్థి విద్యార్థినిలకు స్కూల్ యూనిఫామ్ అందజేసి అనంతరం తోషిబా యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని రుద్రారం గ్రామంలో చదువుకున్న విద్యార్థులు తోషిబా కంపెనీలో పెద్ద ఉద్యోగాలు సాధిస్తే మాకు మీ గ్రామానికి ఎంతో పేరు తెచ్చిన వారవుతారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఏ సిఎస్ చైర్మన్ పాండు, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి మరియు పాలకమండలి తోషిబా పరిశ్రమ యాజమాన్యానికి శాలువాతో సన్మానించారు.తోషిబా పరిశ్రమ యాజమాన్యం సహాయ సహకారాలు మా గ్రామానికి ఎల్లవేళలా ఉండాలని మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్, తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి, పాలకమండలి, గ్రామపంచాయతీ సిబ్బంది, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక హెల్త్ సెంటర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.