Listen to this article

జనం న్యూస్ 3 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండల

కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్య లపై MPDO కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సిఐటి యు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ.. ట్రెజరీలలో నిలిచిన 2024 జులై డిసెంబర్ వరకు ఆరు నెలల వేతనాలు విడుదల చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుండి వేతనాలు చెల్లించాలి చెప్పడం జరిగింది. కానీ మూడు నెలలు గడిస్తా ఉన్న గ్రీన్ ఛానల్ ద్వారా గ్రామపంచాయతీ కార్మికులకు ఎలాంటి వేతనాలు రాలేవు,జీవో నెంబర్ 51 అనుసరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలి. పాత కేటరేలను కొనసాగించాలి సిబ్బందిని అందర్నీ పర్మినెంట్ చేయాలి. రెండవ పిఆర్సి ని వర్తింపజేసి ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను 18 వేలకు పెంచాలి 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 19 తర్వాత సమస్యల పరిష్కారానికై ఏ రోజు నుండైనా రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు వెళ్తున్నామన తెలియజేయుట ఎంపీ ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగయ్య, నర్సింలు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.