

అభివృద్ది పేరుతో అడవులను నరకొద్దు పోలాడి రామారావు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
హైద్రాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లోని 400 ఎకరాలలో ఉన్న ఆహ్లాదకరం కలిగించే అటవీ ప్రాంతాన్ని అభివృద్ది,, పేరుతో చెట్లను నరికి వెయాలనే ప్రయత్నాన్ని పాలకులు వెంటనే విరమించుకోవాలని, రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.అభివృద్ది కోసం అడవులను నరకొద్దని, వృక్ష సంపద నాశనమైతే భవిష్యత్ తరాలకు జీవనం ప్రమాదంలో పడుతుందని,సెంట్రల్ యూనివర్సిటీ భూములలోని చెట్లను నరకవద్దని, వృక్ష సంపద కాపాడాలనే, న్యాయమైన డిమాండ్ తో ప్రజాస్వామికంగా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయడం సరికాదని , అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం హుందాగా వ్యవహరించాలని పోలాడి రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను, విశ్వవిద్యాలయాల భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని తెగనమ్మాలని చూడటం చూస్తే కంచే చేను మేసినట్టు ఉందని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.వృక్ష సంపద నాషనమైతే భవిష్యత్ తరాల మనుగడకే ప్రమాదమని, అభివృద్ది పేరుతో ఊహించని స్థాయిలో వృక్షాలను నరికి వేయడం హేయమైన చర్య అని, అర్థవంతమైన అభివృద్ది చేయాలంటే ప్రకృతిని రక్షించడం తప్పని సరన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి భవిష్యత్ విద్యార్థుల ప్రయోజనాలకు, యూనివర్సిటీ లో పరిశోధనల అభివృద్ధికి, నాణ్యమైన ప్రయోగశాలల నిర్మాణానికి ఉపయోగ పడే భూములను వేలం వేసే పద్ధతులను విడనాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జీవరాశులను నాశనం చేసే కుట్రలను తిప్పికొట్టాలని. ప్రభుత్వ దమన కాండనపై ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని గురువారం మీడియా ద్వారా పోలాడి రామారావు పిలుపునిచ్చారు.