Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో గురువారం నాడు మండల స్థాయి విద్యారంగ పోటీలను నందలూరు మండల విద్యాశాఖాధికారి 1 L.నాగయ్య. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు విద్యారంగ పోటీల్లో పాల్గొని పోటీతత్వం పెంపొం దించుకోవాలని కోరారు. నందలూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ షేక్ రౌఫ్ బాష.నాగిరెడ్డిపల్లె హెడ్ మాస్టర్ జయలలిత కుమారి మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ముందస్తు వేడుకల్లో భాగంగా UTF ఉపాద్యాయ సంఘం ఆద్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం హర్షణీయం అని కొనియాడారుUTF మండల నాయకులు ముక్కర హరినాథ్ ,కాకి రమేష్ జోషి, జి.కృపానందం, వి.సుధాకర్, కె ఆనంద్,ఆరెం చిన్న రెడ్డన్న మాట్లాడుతూ ఈ వ్యాసరచన, వకృత్వ పోటీలకు మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 50 మంది పాల్గొనడం అభినందించ దగ్గ అంశమని,దీనికి సహకరించిన ప్రధానో పాధ్యాయులు,ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో మండలం లోని ఉపాద్యాయులు జంగంశెట్టి చంద్ర కుమార్, పగడాల భరత్ కుమార్, సుబ్బ లక్షుమ్మ.. P.D గౌరీ PET జగన్ జూనియర్ అసిస్టెంట్ షాకీర్ హుస్సేన్,, MRC కార్యాలయపు అటెండర్ పూలతోట హరినాథ్, విద్యార్థులు పాల్గొన్నారు.