Listen to this article

జనం న్యూస్ 3 ఏప్రిల్ ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ )

వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  ప్రారంభించడం జరిగింది. అనంతరం సన్న బియ్యాన్ని గ్రామ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
🔹ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల అదనపు భారాన్ని భరించి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి  అందించారు. పూడూరు మండలం కేంద్రంలో 20లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.