Listen to this article

30కిలోల గోటి తలంబ్రాలు అందించిన నిజామాబాద్ భక్తులు

రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేత

రామకోటి రామరాజు ప్రోత్సాహంతోనే 2సారి పాల్గొన్నాము

జనం న్యూస్, ఏప్రిల్ 4 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు భద్రాచల సీతారాముల కల్యానానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250కిలోల గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ పిలుపు మేరకు గ్రామ, గ్రామాన వేలాది భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రాజురాజుకు అందజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నాడు నిజామాబాద్ లోని కోటగల్లిలో గల మార్కండేయ స్వామి దేవాలయంలో గోటితో గత కొన్ని రోజుల నుండి వడ్లను ఓలిచి 30కిలోలకు పైగా తలంబ్రాలుగా తయారుచేశారు. భద్రాచలం వెళుతున్న రామకోటి రామరాజుకు కళాశాలతో వాటిని అందజేశారు. మాట్లాడుతూ మా గ్రామం నుండి భద్రాచల కళ్యానానికి వెళ్లడం మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. ఈ అవకాశం మాకు కల్పించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు కృతఙ్ఞతలు తెలిపారు. మా చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు కూడా ఇందులో బాగా స్వాములం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ దేవాలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.