Listen to this article

మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో నూతన మండలంగా ఏర్పడ్డ డోంగ్లి మండల అభివృద్ధికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నారు , డోంగ్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ తెలిపారు. గురువారం డోంగ్లి మండల కేంద్రంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాకాంత్ పటేల్ ,శివాజీ పటేల్, దీన్ దయాల్ అరుణ్ పటేల్, ఇతర ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు