Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో వడగండ్ల వర్షం పడొచ్చని సూచించింది.గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.