Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3

ఎన్నికలకు ముందు ఎంప్లాయర్ మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాడి వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన తర్లుపాడు మండలం మీర్జాపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తనకు పదవి వచ్చేందుకు కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డినీ తర్లుపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి రంగారెడ్డి ఘనంగా సన్మానించారు..తనకు లభించిన పదవిని బాధ్యతగా స్వీకరించి ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల తరపున పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు బాధ్యతగా కృషిచేస్తానని వివరించారు..కార్యక్రమంలోఎంపీపీ రామసుబ్బారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీపీ లు గాయం శ్రీనివాస్ రెడ్డి,చెంచిరెడ్డి,ఎస్సీ సెల్ నాయకులు గురవయ్య, మీర్జపేట సర్పంచ్ కాశయ్య,గొల్లపల్లి సర్పంచ్ రామిరెడ్డి,మాజీ సర్పంచ్ మల్లారెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు వెలిగొండ రెడ్డి,దేవి రెడ్డి భాస్కర్ రెడ్డి,కలుజువ్వలపాడు సర్పంచి శిఖామని,పార్టీ నాయకులు కొండారెడ్డి,రాగసముద్రం సర్పంచ్ రమణారెడ్డి,తర్లుపాడు సర్పంచ్ ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు..