Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

రాష్ట్ర స్థాయి కమిషనర్ లతో సి. డి. ఎం. ఏ. శ్రీదేవి అధ్యక్షతనలో ఏం. సి. ఆర్ , హెచ్. ఆర్, డి. హైద్రాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆస్తి పన్నుల వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచిన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు, సి.డి. ఎం. ఏ. టి కె శ్రీదేవి, చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని, మరియు ఎల్లప్పుడు ఉత్తమా ప్రతిభ కనబరుస్తున్నందున అవార్డ్ (కన్సిస్టెంట్ అచ్చివర్ అవార్డు) గురువారం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మా మున్సిపల్ సిబ్బంది, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంఘాల నేతల సహకారంతో ఇంత గొప్ప ప్రశంస పత్రాన్ని అందుకోగలిగామని అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.