Listen to this article

▪ వెనువెంటనే ఆచూకీ కనుక్కున్న పోలీస్ సిబ్బంది..
▪ తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ వరగంటి రవి..
జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన సంగి శంకర్,అనే వ్యక్తి యొక్క కూతురు ఈనెల 11న ఆకస్మితంగా కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుటకు బృందాన్ని ఏర్పర్చి ఇన్విస్ట్రేషన్ చేస్తుండగా, అస్మిత యొక్క సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా, కరీంనగర్లో తన ఫ్రెండ్ వద్ద ఉన్నట్లు కనుక్కొని, సీఐ వరగంటి రవి ఆదేశాల మేరకు, హోంగార్డ్ ఎండి యాకూబ్, అమ్మాయిని తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులైనటువంటి సంగి శంకర్ కు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి అప్పచెప్పారు. ఆధునిక టెక్నాలజీ,,సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా, టెక్నాలజీని ఉపయోగించి, అమ్మాయి ఆచూకీ కనుక్కున్నందుకు పలువురు పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నారు.