Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-పాఠశాలల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ అమరావతి మంగళగిరి

పత్రికా ప్రకటన 2025 26 విద్యా సంవత్సరమునకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో 6 7 మరియు 8వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీలకు జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీలో ప్రవేశములకు నిర్వహించబడు APRS CAT-2025 APRJC & DC CET-2025 పరీక్షలకు ఆన్ లైన్లో కాక నేరుగా సంస్థకు గురుకుల విద్యాలయమునకు స్వయంగా కాని, పోస్ట్ లేదా ఇ మెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులు పరిశీలించబడవు అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు అని తెలియజేయడమైనది.

        వి.ఎన్.మస్తానయ్య
                   డైరెక్టర్ కార్యదర్శి