

జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం)
మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్ వద్ద గల చౌదరి చెరువు అలుగు ద్వారా సోరంగేశ్వర చెరువుకు వెళ్ళు ప్రధాన కాలువ పూడికతీకితతో పాటు నీరు సాపిగా వెళ్లేటట్టు సిమెంట్ కాంక్రీట్ తో శాశ్వత పరిష్కారం చేసి వరద నుండి గ్రామాన్ని కాపాడాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లను కోరారు.గురువారం హైదరాబాద్ జల సౌధలో ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మండలంలోని గ్రామాలలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి, మండలాన్ని అభివృద్ధి పరచాలని ఉత్తమ్ దంపతులను కోరారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు,బస్టాండ్ చెరువు అలుగు పోసినప్పుడు నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రధాన కాల్వ పూడిపోవడంతో వరద నీరు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీతో పాటు గ్రామం సగభాగం నీటిలో మునిగిపోతుందని, రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వారికి వివరించారు. వాగు కాల్వ పూడికతీత తీసి అవసరమైన చోట్ల కల్వర్టు లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ని కోరగా వారు వేంటనే స్పందించి సమస్యను పరిస్కరం చూపాలని, ఎస్టిమేషన్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతోపాటు మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్న శ్రీకాంత్ ఉన్నారు.