

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్.
జనం న్యూస్,ఏప్రిల్ 03,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు మాట్లాడుతూ గతంలో గడచిన అనేక సంవత్సరాలుగా ఉన్నత స్థాయి కుల సముదాయాలకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నియమించి, మాదిగ సామాజిక వర్గానికి విస్మరించారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టులతో మొదలుకొని వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వరకు మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాదిగ సామాజిక వర్గానికి అనాది కాలం నుంచి ఓట్ల కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కానీ,మాదిగ సామాజిక వర్గ సభ్యులకు ఎటువంటి పదవులు కల్పించే ప్రయత్నం గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ ఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్న మాదిగ సామాజిక వర్గానికి పట్టించుకునే పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా మాదిగలకు ఖేడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదిగలకు నియుక్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.లేనియెడల 20వేల డప్పులతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ విషయంపై చొరవ తీసుకోకా ఆశ మాసిగా వదిలేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం సత్తా చూపిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉపఅధ్యక్షులు అంజయ్య,ఎర్రోళ్ల.మొగులయ్య,ఎర్రోళ్ల.చిన్న సాయిలు,మేత్రి సాయిలు,ఎర్రోళ్ల జైపాల్,ఎర్రోళ్ల.డేవిడ్, ఘనపూర్ మేత్రి. సాయిలు,ఎర్రోళ్ల.రాజశేఖర్,ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.