

జనం న్యూస్ ఏప్రిల్03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
బీహార్ రాష్ట్రంలోని గాయ జిల్లాలోనీ బుద్ధగయ మహాబోధి విహార్ బౌద్ధులకు వెంటనే అప్పజెప్పాలని బిక్కు సంఘ్,భారతీయ బౌద్ధ మహాసభ,అంబేద్కర్ సంఘం,రామాబాయి మహిళ మండలి డిమాండ్ చేశాయి.దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ నుండి మండల కేంద్రములోని పలు వాడల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. పొచ్చమ్మ రోడ్డు,శివాజీ చౌక్,పాత బ్యాంక్ రొడ్డుతో గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు,అక్కడి నుండి జీఎంఆర్ చౌక్ ,శివాలయం రోడ్డు మీదుగా పాత గ్రాపంచాయతీ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బుద్ద విహార్ వరకు శాంతి ర్యాలీ సాగింది. బౌద్ధులకు సంబధించిన బుద్ద గయ మహాబోధి విహార్ బౌద్ధులకు వెంటనే అప్పాజెప్పలని డిమాండ్ చేశారు.బీహార్ రాష్ట్రంలో బుద్ద విహార్ అభివృద్ధి కోసం 1949 సంవత్సరంలో నిర్మించిన బి టీ యాక్ట్ నీ రద్దు చేయని నినదించారు.ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ బిక్కు సంఘ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బంతే భరద్వాజ్ మాట్లాడుతూ బౌద్ధులకు చెందిన బౌద్ద బీహార్లో బ్రాహ్మణులు దొంగ చాటున చొరబడి కబ్జాకు పాల్పడి పూజ కార్యక్రమాలు నిర్వహించడం బాధాకరమని అన్నారు.భారత దేశం లో హిందువుల మందిరాలు హిందువులకు,ముస్లింల మజిత్ లు ముస్లింలకు,పాస్టర్లకు చర్చిలు ఇలా ఎవరి మందిరాలు వారికి ఉండగా బౌద్ధుల మందిరంలో బ్రాహ్మణులు చొరబడి హిందువులు దేవతలకు సంభంధించిన పూజలు చూస్తున్నారని వెంటనే వాటిని ఆపి బౌద్ధులకు అప్పజెప్పి భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ పెర్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల భారతీయ బౌద్ద మహా సభ అధ్యక్షులు జయరాం ,రామానాయి మహిళ మండలి అధ్యక్షురాలు గంగుబాయి ,బౌద్ద సమాజ్ అధ్యక్షులు విలాస్,మహాత్మా రాజేంద్రప్రసాద్,అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు దుర్గం హంస రాజ్, నాయకులు శ్యామ్ రావు దొండుజి దుర్గె , హిరిశన్,పాండుజి,రాజేశ్వర్,శ్యామ్ రావు లాహుజి దుర్గే, జాడే,రోషన్ ,అరుణ్ , బాల్వంత్, పేంటు,సిద్దార్థ యువజన సంఘం నాయకులు ,మహిళ మండలి సభ్యులకు కమల,బిజ్జు బాయి, లక్మీ,తదితరులు పాల్గొన్నారు.
