

జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
దేశ ప్రజా సంస్థలను, కార్మిక చట్టాలను కార్పొరేట్లకి ధారాదత్తందేశ ప్రజా సంస్థలను, కార్మిక చట్టాలను కార్పొరేట్లకి ధారాదత్తం చేస్తే ప్రతిఘటన తప్పదు.
-సిపిఐ జిల్లా సహాయ బుగత అశోక్ చేస్తూ కార్పొరేట్ల సేవలో నిగిపోతున్న మోడీ విధానాలు మార్చుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన తప్పదనీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. గురువారం ఉదయం విజయనగరం పట్టణంలో భారత కమ్యునిస్టు పార్టీ ( సిపిఐ ) ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కె.ఎల్.పురంలో సిపిఐ దేశ వ్యాప్త పిలుపు లో భాగంగా కరపత్రాల పంచుతూ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి దేశసంపదలోని రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు గనులను, బి ఎఫ్ ఎన్ ఎల్ కారు చౌకగా అప్పజెప్తున్నారని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసీ సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక చట్టాలను, పౌర హక్కులను కాలరాస్తున్నారు. రాష్ట్రంలో లక్షలాది అసంఘటితరంగంలో లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తున్న కార్మికులు, వివిధ ప్రభుత్వ స్కీములలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించకుండా వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని, అందుకే అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీమ్ వర్కర్లును, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు కేంద్రంలో బీజెపీ, రాష్ట్రములో కూటమి ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇప్పటివరకు కలగా ఉన్న కార్మిక చట్టాలు మార్పు పైన మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందన్నారు. వర్కర్స్ నియామకం తొలగింపుల్లో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు దారాదత్తం చేసే నిర్ణయాలు చేసే కుట్రలో ఉందన్నారు. భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారనీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు భగత్ సింగ్ స్ఫూర్తితో భారత కమ్యునిస్టు పార్టీ ( సిపిఐ ) దేశవ్యాప్తంగా కార్మికవర్గంలో రాజకీయ చైతన్యాన్ని కలిగించేందుకు రాజకీయ ప్రచార జాతా నిర్వహిస్తున్నదన్నారు. కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.