

విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగు ప్రాక్టీసును నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్దగల జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏప్రిల్ 3న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, అధికారుల ఫైరింగు ప్రాక్టీసును పర్యవేక్షించి, ఫైరింగు ప్రాక్టీసులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు అధికారుల ఫైరింగు నైపుణ్యం మెరుగుపర్చేందుకు ప్రతీ ఏడాది ఫైరింగు ప్రాక్టీసు నిర్వహించడన్నది ఒక సాధారణ ప్రక్రియ అని అన్నారు. ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా నిర్వహించడం వలన పోలీసు అధికారులు ఆయుధాలను సమర్ధవంతంగా వినియోగించే నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, రక్షణ చర్యలు చేపట్టడంలో ఫైరింగు ప్రాక్టీసు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ఆయుధాల నిర్వహణలో పరిజ్ఞానం మెరుగుపర్చుకోవడం, శారీరక, మానసిక సమతౌల్యం సాధించడం, ఒత్తిడిలో కూడా సరిగ్గా లక్ష్యాన్ని చేధించడం, నియంత్రణలో ఉండేలా ప్రాక్టీసు అవసరమని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్ధేశం చేసారు. అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిస్టల్, గ్లాక్ పిస్టల్ మరియు ఎంపి4 వంటి అధునాతన ఆయుధాలతో ఫైరింగు ప్రాక్టీసు చేసి, ఇతర పోలీసు అధికారుల ఫైరింగు ప్రాక్టీసును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పర్యవేక్షించారు. ఈ ఫైరింగు ప్రాక్టీసులో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, జి.భవ్యరెడ్డి, ఎం.వీరకుమార్, ఎస్.రాఘవులు, పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.