

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్
జనం న్యూస్ 04 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా ఎపిఎస్పీ చింతలవలసలో గల బెటాలియన్ శిక్షణ కేంద్రంను విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ఏప్రిల్ 3న సందర్శించి, పోలీసు శిక్షణ కేంద్రంలో గల మౌళిక వసతులను పరిశీలించారు. బెటాలియన్ కు విచ్చేసిన డీఐజీ గోపినాథ్ జట్టి గారికి కమాండెంట్ మాలిక గార్గ్ గారు స్వాగతం పలుకగా, బెటాలియన్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి మాట్లాడుతూ – బెటాలియన్ పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు శిక్షణకు కావాల్సిన, అవసరమైన మౌళిక వసతులను పరిశీలించామన్నారు. పోలీసు కానిస్టేబుళ్ళ నియామకాలు కొద్ది రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో శిక్షణకు వచ్చే కానిస్టేబుళ్ళుకు బెటాలియన్ పోలీసు శిక్షణ కేంద్రంలోగల మౌళిక వసతులను పరిశీలించామన్నారు. శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, ఇంకనూ అవసరమైన మౌళిక వసతుల కల్పన గురించి అధికారులను అడిగి తెలుసు కున్నారు. పోలీసు శిక్షణ కేంద్రాల్లోగల తరగతి గదులను, ఆఫీసు కార్యాలయం, వంట గది, డైనింగు హాలు, స్టోరు రూం, వాష్ రూంలను, స్నానపు గదులను, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండు వివరాలను విశాఖ డిఐజి గారికి కమాండెంట్ వివరించారు. పరిశీలించారు. శిక్షణ కేంద్రం ప్రారంభంలో కల్పించిన మౌళిక వసతులకు
అదనంగా అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. శిక్షణ కేంద్రంలో మంచాలు, పరుపులు, క్రీడా సామగ్రి, టేబుల్స్, కంప్యూటర్లు, ఫ్యానుల పని తీరును బెటాలియన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శిక్షణ కేంద్రంలోగల టీచింగు, నాన్ టీచింగు సిబ్బందిగా ఎంతమంది పని
చేస్తున్నదన్న విషయాలను బెటాలియన్ కమాండెంట్ మాలిక గార్గ్ విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి వివరించారు. విశాఖపట్నం రేంజ్ డిఐజి వెంట కమాండెంట్ మాలిక గార్గ్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అసిస్టెంట్ కమాండెంట్స్ జీ.లక్ష్మి నారాయణ, ఎస్.బాపూజీ, డివి రమణ మూర్తి మరియు ఇతర బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.