

జనం న్యూస్ //ఏప్రిల్ // 4 // జమ్మికుంట //కుమార్ యాదవ్..
ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల,పాపక్కపల్లి గ్రామాలలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలతో వాడ,వాడలా పాదయాత్ర జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరుశురామరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఇ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే పార్టీ కాంగ్రెస్ అని,బీజేపీ ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగాన్ని అవమానిస్తుంది, అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మరియు భారత దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి, మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్, ,గ్రామ శాఖ అధ్యక్షులు వానరసి జాన్, గాజనవేణి శ్రీనివాస్ యాదవ్, ఐలాపురం రవి, సిద్దు,శంకర్ ,ఊర సంపత్ రావ్,గాజ వీర గోపాల్,బొడ్డుపల్లి సతీష్,దొగ్గల భాస్కర్,బొమ్మ శ్రీనివాస్, ఏరెడ్డి సతీష్ రెడ్డి, లింగాల రాజేశం, శూదుల రమేష్, గాజనవేన మహేష్, మాసాడి కిషన్ రావు, మర్రి సదానందం, దూస కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.