Listen to this article

సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ టాప్..

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు.

జనం న్యూస్ // ఏప్రిల్ //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..

జమ్మికుంట మండల పరిధిలోని మాచనపల్లి గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించారని, ప్రతి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుడికి సన్న బియ్యాన్ని అందజేస్తామని అన్నారు.పేదల కోసం ఏ ప్రభుత్వం చేయని మంచి పనిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే చేశామని అన్నారు.మన దగ్గర పండిన పంటను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేయడం భసూచకమని,భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. బీజేపీ ఎంపీ లు ప్రభుత్వం పైన, సన్న బియ్యం పంపిణీ గురించి తప్పుడు మాటలు మానుకుని దమ్ముంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాచనపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల ప్రశాంత్, ఓరుగంటి రవీందర్ రావు, గుడిపాటి సత్యనారాయణ రెడ్డి, ఉమ్మడి సందీప్,కావటి తిరుపతి, జంగం నాగరాజు, బోలవేనా సంపత్, బోలవేనా సారయ్య, పర్లపల్లి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.