Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన నంబాల పంచాయతీ కార్యదర్శి పుష్పలత ఎస్సి సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్, డీలర్ జానకి రామ్

రెబ్బెన : రెబ్బెన మండలం నంబాల. గ్రామాల్లో పేద ప్రజల కడుపు నింపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని,ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రెబ్బెన మండల ఎస్సి సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్ అన్నారు నంబాల గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆనంద్ మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు అందించడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.