

జనం న్యూస్ ఏప్రిల్ 4 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)
ఐ.పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో సంపూర్ణ శిలామయ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ పునః ప్రతిష్టలో భాగంగా హనుమత్ సీతా రామ లక్ష్మణ మరియు గణపతి జ్ఞాన సరస్వతి వార్ల శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. ఈ కార్యక్రమలో భాగంగా శృంగ వృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీవారి అనుగ్రహ భాషణంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.
రామాయణాన్ని మన నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని మన ప్రాంతంలోనే ఇటువంటి సంపూర్ణ శిలామందిర నిర్మాణం ఇదే మొదటిది అని కొనియాడారు. అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఎఫ్ ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాతృ మూర్తులు వెలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
