Listen to this article

రామయ్య కల్యానానికి లక్షల మంది భక్తుల తలంబ్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న భక్తులు

రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమన్న

భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రావణ్ కుమార్

జనం న్యూస్, ఏప్రిల్ 5 ( మలుగు విజయ్ కుమార్)

భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం కోసం గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు మూడోసారి అవకాశం ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు, ప్రతి వ్యక్తిలో రామభక్తి నెలకొల్పాలని గత 45రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన వేలాది మంది భక్తులచే రామనామ స్మరణ చేపిస్తూ గోటితో వడ్లను ఓలిపించి 250కిలోల పైగా గోటి తలంబ్రాలను సిద్ధం చేపించి రామభక్తిని చాటుకున్నాడు. శుక్రవారం నాడు భద్రాచల దేవస్థానంలో కళాశాలతో ఊరేగింపు చేసి ఏఈవో శ్రవణ్ కుమార్,కి దేవస్థానంలోనే తలంబ్రాలకు ప్రత్యేక పూజ జరిపి రామకోటి రామరాజు అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల రామకోటి రామరాజు కృషి పట్టదల అమోఘమన్నారు. లక్షల మంది భక్తులచే రామనామం లిఖింపజేపించమే కాకుండా గత 3సంవత్సరాల నుండి కోటి తలంబ్రాల దీక్షకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన్ని తట్టి అద్భుతంగా నిర్వహించిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న లెక్కచేయకుండా రాముని కోసమే తన జీవితాన్ని దారపోసిన గొప్ప రామభక్తుడు అని కొనియాడారు. అక్కడ ఉన్న ముత్యాల తలంబ్రాలలో రామకోటి రామరాజు తీసుకెళ్లిన గోటి తలంబ్రాలు కూడా కలిపారు.