Listen to this article

జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

బి అర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ డిమాండ్… జిల్లాలోని 12 మండలాలలో మండలానికి ఒక్క గ్రామాన్ని మాత్రమేఎంపిక.చేయడమంటే స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఓట్లు దండుకోవడమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ ధ్వజమెత్తారు.గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండలంలోని నల్లదెవరపాడు కుర్వపల్లి-140,గట్టు మండలం-ఆరగిద్ద-212, KT దొడ్డి-ఉమిత్యాల-109, ధరూర్-ఆల్వాలపాడు-165, మల్దకల్-నాగర్ దొడ్డి-188,
మొత్తం 814 ఇండ్లను.అలాగే.. అలంపూర్.నియోజకవర్గంలోనిఅలంపూర్మండలం-గొందిమల్ల-82,ఉండవెల్లి-బస్వాపురం-27,మనోపాడు-చంద్రశేఖర్ నగర్-114,వడ్డేపల్లి-కోయిలదిన్నె-137,రాజోలి-తూర్పు గార్లపాడు-130,ఇటిక్యాల-గోపాలదిన్నె-110,అయిజ-కుటుకనూరు-120మొత్తం 720 ఇండ్లను ఇలా మొత్తం జిల్లాలో 1534 ఇండ్లను మాత్రమే కేటాయించడం ప్రజలను మోసం చేయడమే అని అన్నారు.జిల్లాలో 3 కేటగిరీలుగా విభజించి అందులో L1 భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు సహాయం-మొత్తం దరఖాస్తు చేసుకున్నవారి.సంఖ్య-50,978,L2 ఎలాంటి భూమి లేకుండా ఉన్నవారు దరఖాస్తు కున్నవారిసంఖ్య-18,670, L3 గుడిసెలు షెడ్లలో ఉండేవారు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య-70,765 ఇలా మొత్తం గద్వాల జిల్లాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య-1,40,413 కు గాను 1534 ఇండ్లు మాత్రమే మంజూరు చేయడం దారుణమని విజయ్ కుమార్ అన్నారు.తక్షణమే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని లేని పక్షంలో దరఖాస్తు పెట్టుకున్న వారందరితో కలిసి BRS పార్టీ తరుపున పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం అని ఈ సందర్బంగా BRS పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు..