Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్)

హైదరాబాద్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వర్గాల వారికి రూ.లక్ష నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సహాయంను ప్రభుత్వం అందించనుంది. రాయితీలు, బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించ డానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. దీంతో ఈ పథకా నికి భారీ దరఖాస్తులు వస్తున్నాయి.రాజీవ్ యువ వికాసం పథకంకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 1వ తేదీ వరకు తొలుత ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, ఈ గడువును ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించింది. ఈ పథకం కింద ఏప్రిల్ 3వ తేదీ వరకు 7లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సర్వర్ బిజీగా మారడంతో ధ్రువ పత్రాల జారీ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఆదాయ ధ్రుపవత్రాల కోసం దరఖాస్తుదారులు ఇబ్బందులు తలెత్తుతున్న సందర్భంలో స్పందించిన ప్రభుత్వం…తెల్లరేషన్ కార్డుతో దరఖా స్తులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.రాజీవ్ యువ వికాసం పథకంపై బీసీ కా ర్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు మాట్లాడుతూ కీలక విషయాన్ని చెప్పారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అప్లికేషన్ కోసం ఇన్ కమ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేని వారు మీ సేవా నుంచి తీసుకున్న ఇన్ కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ను అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 2016 తరువాత మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం ఉంటే చాలని, కొత్త సర్టిఫికేట్ కోసం మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొ న్నారు. అర్హులైన దరఖా స్తులు నింపి మండల, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు.