Listen to this article

జనం న్యూస్ – ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో శుక్రవారంనాడు మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల మొదటి వార్షికోత్సవం సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ నకులరావు, ప్రిన్సిపల్ ఏ శివకుమార్ జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు, విద్యార్థులు పాటలు,నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు .అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే విలువలతో కూడిన విద్య ముఖ్యమని, విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. తమ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి విద్యార్థులకు ఐఐటి, నీట్ బేసిక్ క్లాసులు నిర్వహిస్తున్నామని, లీడ్ ప్రోగ్రాం తో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్ పెంపొందించడానికి క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు, పాఠశాల కరస్పాండెంట్ నకుల్ రావు మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు .అనంతరం సంస్కృతిక కార్యక్రమాలలో, పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు,సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల డైరెక్టర్స్ బి. ప్రసాద్, జి.సుబ్బారావు,ముబీన్, పాషా, కే.శంకర్ ఉపాధ్యాయులు కే.రాజ్యం, రజియా, బ్యూలా రాణి, సంతోషి, లక్ష్మీ కమల,గిరిజ, స్నేహలత, సంయోజిత, అనూష,ప్రియాంక,శ్వేత, హేమలత,ప్రేమ్ చంద్, వెంకటేశ్వర్లు (కరాటే మాస్టర్), రఘు(పీఈటి),పర్వతనేని నాగేశ్వరరావు(పెదబాబు) మరియ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.