Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

కరీంనగర్ జిల్లా క్షయ నియంత్రణ సంస్థ, జమ్మికుంట టిబి యూనిట్ ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో టిబి మందులు వాడుతున్న వారికి శుక్రవారం నాడు జమ్మికుంట పట్టణంలోని ఆరోగ్య ఉపకేంద్రం 1 లో నిక్షయ్ పోషణ యోజన పథకం లో భాగంగా వారికి ఈనెల న్యూట్రిషన్ కిట్ నిత్యవసర సరుకులు డాక్టర్ మొలుగు చందన అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చందన మాట్లాడుతూ..వారికి పోషకాహారం నిమిత్తం నెలకు రూ 1000 అందించడం జరుగుతుందనిఅన్నారు. అలాగే వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి టిబి మందులు పూర్తిగా 6 నెలల కోర్సు వాడితే టిబి వ్యాది పూర్తిగా నయం అవుతుందని, తెలిపారు. టిబి వ్యాధి పట్ల ఎవరు అజాగ్రత్తగా ఉండరాదని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అందించే ఉచిత మందులతో పాటు నెలకు రూ 1000, న్యూట్రిషన్ కిట్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మొలుగు చందన,హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ రత్న కుమారి, టిబి సూపర్వైజర్ దేవేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ సిబ్బంది సరళ, మంజుల, సాజిదా,రజిత, రాదా, నరేందర్ ఎన్జీవో తిరుపతి మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.