

జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం లో మొత్తం ఆరు ప్రాథమికొన్నత పాఠశాలలు ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ అను కార్యక్రమం క్రింద, అనుభవాలు పంచుకోవడం, విద్యార్థుల మధ్య భాంధవ్యము, ఉపాధ్యాయుల మధ్య,విద్యార్ధి, నూతన ఉపాధ్యాయుల మధ్య మంచి సంభందం, అను లక్ష్యం తో ఎంపిక కాబడినవి. దీనిలో భాగంగా ప్రాథమికొన్నత పాఠశాలలు అంగడికిష్టాపూర్, పాతూర్, పీఎం శ్రీ పాములపర్తి పాఠశాల కు, శివార్ వేంకటాపూర్, ఎర్రవల్లి పాఠశాలలు, ఉన్నత పాఠశాల మార్కుక్ కు, కర్కపట్ల పాఠశాల, ఉన్నత పాఠశాల దామారకుంట కు, వరదరాజ్ పూర్ పాఠశాల, ఉన్నత పాఠశాల చెబిర్తి కి అటాచ్ చేయబడినవి. ఇట్టి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అంగడికిష్టాపూర్ పాఠశాల, హోస్ట్ స్కూల్ అయిన పీఎం శ్రీ పాములపర్తి పాఠశాల ను సుమారు 89 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉదయం ప్రార్ధన నుండి పాఠశాల భోజన సమయం వరకు పూర్తి రోజు సందర్శించారు. పాఠశాల పరిసరాలు, లైబ్రరీ, ల్యాబ్ కార్యక్రమాలు, డిజిటల్ విద్య, అనేక విషయాలు పై అవగాహనా పొందారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా సంతోషం వ్యక్తం చేసారు. ఇట్టి కార్యక్రమం లో మండల విద్యాధికారి శ్రీ ఏ వెంకటరాములు, ప్రధానోపాధ్యాయులు, బాలకృష్ణ, ఉపధ్యాయులు సంతోష, హారిక, చిన్నికృష్ణ, ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు నరోత్తమ్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.