Listen to this article

గురుకులంలో 60 సీట్లు సాధించిన విద్యార్థులు

జనం న్యూస్,ఏప్రిల్ 4, జూలూరుపాడు (రిపోర్టర్ జశ్వంత్):

ఐదో తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 60 మంది ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఆరబోయిన హుస్సేన్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం నందు ఫిబ్రవరి 23 న గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు ఈ ప్రవేశ పరీక్ష నందు 60 మంది విద్యార్థులకు పైగా సీట్లు సాధించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ హుస్సేన్ మాట్లాడుతూ జూలూరుపాడు మండల కేంద్రం నందు సాయి ఎక్సలెంట్ విద్యాలయం ప్రతి సంవత్సరం నవోదయ ,గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యాలయం సీట్లు సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అదేవిధంగా మా సంస్థ నందు ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణతో పాటు గ్రామస్థాయిలో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామన్నారు పోటీ పరీక్షల్లో అత్యధిక సీట్లు సాధించి జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా తక్కువ ఫీజు తో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత మా సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మాత్రమే సాధ్యం అని గర్వంగా తెలియజేస్తున్నాము 2025..26నుండి విద్యా సంవత్సరానికి గాను సీబీఎస్ఈ. కేరళ టీచర్స్ తో విద్యా బోధన సాగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేసారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జై శివకుమార్,ఎకడమిక్ డైరెక్టర్ బి.సరిత, ఉపాధ్యాయుని.ఉపాధ్యాయులు రాంబాబు,మృదుల్, అనిత,ఎ.సరిత,నబీన,భాను, పావని, కళ్యాణి ,దుర్గ భవాని,నవ్య ,ప్రశాంతి, రజిత ,నందిని, పద్మ ,సత్యవతి ,జమున ,అరుణ ,యోగా టీచర్ ప్రమీల ,మరియు తల్లిదండ్రులు నవీన్ రెడ్డి ,విద్యార్థి ,విద్యార్థినులు పాల్గొన్నారు.