

జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో వివో కమ్యూనిటీ హాల్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సఖి యొక్క ముఖ్య ఉద్దేశాలు అందించిన సేవలను తెలియజేయుటకు సఖి లీగల్ అడ్వైజర్ మేడం శ్రీదేవి,కేస్ వర్కర్ అనూష,పాల్గొని సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అందించిన సేవలను వివరించడం జరిగింది ఐదు రకాల సేవలను గురించి తెలుపుతూ కౌన్సిలింగ్ సహాయం వైద్య సహాయం పోలీస్ సహాయం తాత్కాలిక వసతి న్యాయ సహాయం ఐదు రకాల సేవలను గురించి తెలుపుతూ చట్టాలపై ప్రతి ఒక్క మహిళలకు అవగాహన ఉండాలని చెప్పడం జరిగింది సఖి సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు తెలుపుతూ గృహ హింస లైంగిక వేధింపులు పనిచేసేచోట వేధింపులు అత్యాచారాలు ఇలాంటి రక్షణ పొందడానికి సఖి సెంటర్ పనిచేస్తుందని చెప్పడం జరిగింది సఖి సెంటర్ సిబ్బంది 24 గంటలు పని చేస్తామని సమస్య ఉన్నప్పుడు 181 మహిళ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం రక్షణ లభిస్తుందని అదేవిధంగ 08702452112, 7382983088 అనే నెంబర్ లకు కాల్ చేయడం ద్వారా బాధిత మహిళలకు సహాయం అందించ బడుతుంది అని చెప్పడం జరిగింది ఈ సదస్సులో వి వో ఏ రజిత ఎస్ హెచ్ జి గ్రూప్ లీడర్స్ మెంబర్స్ లు పాల్గొన్నడం జరిగింది.