

జనం న్యూస్- ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ –
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మరియు పైలాన్ కాలనీలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 85 లక్షల మంది లబ్ధిదారులకు ఒక కోటి 81 లక్షల 676 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడానికి పూనుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు, పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించేందుకే రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నాయకులు జంగయ్య, బాలాజీ నాయక్ ,మంగాతా నాయక్, చిన్ని ,జనార్ధన్, యోహాను, సోషల్ మీడియా కన్వీనర్ మద్దాల భాను, షేక్ ఖాసీం, వేణు, మేడే సైదమ్మ సంఘమిత్ర స్టోర్ వెంకటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.