

బిచ్కుంద ఏప్రిల్ 4 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున జూనియర్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారని ప్రిన్సిపల్ కె. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువు లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే ఉన్నత లక్ష్యాల ను చేరుకుంటారని ఆశావాద దృక్పథంతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని ప్రతి ఒక్కరు జీవితంలో రాణించాలనీ, ఉన్నత విద్యను అభ్యాసించాలని అన్నారు.కళాశాల తో పాటు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

