

జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సన్నబియ్యం కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధి దారులకు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి వంద ట్రౌమ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అజ్జమర్రి బండ పోతుగల్ మీదుగా అందోల్ నియోజవర్గం వెళ్లేందుకు. మంజీరా నదిపై 70 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.నర్సాపూర్ కు ఇంటిగ్రేటెడ్ రేసి డెన్సియల్ స్కూల్ మంజూరు చేస్తామన్నారు మహిళల్లో మార్పు రావాలన్నారు మహిళా సాధికారతతోనే మార్పు సాధ్యం అవుతుందని తెలిపారు. అందుకోసం అమ్మాయిలు బాగా చదువుకోవాల్సిన అవసరం ఉందని,యువత వ్యసనాలకు బానిసై రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అన్నారు.నర్సాపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అన్నారు ఈ సందర్భంగా 645 మంది లబ్ధిదారులకు 6.50కోట్ల చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జాయింట్ కలెక్టర్ నాగేష్.గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి. ఆర్డీఓ మహిపాల్. తహసీల్దార్ శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.
