

జనం న్యూస్ ఏప్రిల్ 04 నడిగూడెం
మండలంలోని రత్నవరం హరి హర క్షేత్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కిసర లలిత రెడ్డి, అర్చకులు వెంకట శివ కుమార్ శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 9గం.లకు ఎదుర్కోలు,12గం.లకు సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.