

ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, ఏప్రిల్ -05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఐటిఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 6 ట్రేడ్ లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటిఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటిసి ( అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) భవన నిర్మాణం, పరికరాల అమరిక పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఐటీఐ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఐటిఐ వైస్ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.