

జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్టికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్టిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ ప్టషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.