

మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నాట్య ప్రదర్శన
జ్ఞన్ వికాస్ యాజమాన్యం
జనం న్యూస్,ఏప్రిల్ 05,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని జ్ఞన్ వికాస్ పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్ లో చదువుల తల్లి సరస్వతి మాత ప్రతిమాను పూజించి,దీపారాధనతో చిన్నారుల నృత్య నాట్య ప్రదర్శనతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం జీవిస్తున్న ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం,చదువే ఆని అన్నారు.చదువుకునే పిల్లలు నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండాలని విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.విద్యను అభ్యసించే విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అని అన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, సర్వసభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రథమంగా తల్లి దైవంగా, ద్వితీయంగా తండ్రి దైవంగా,తృతీయంగా విద్యాబుద్ధులను బోధించే పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులే దైవమని అన్నారు. పాఠశాలలో బోధించిన బోధనలను శ్రద్ధ బుద్ధులతో అభ్యసించినట్లయితే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు. చదువుతోనే సర్వసభ్య సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు, ఉన్నతమైన పదవులను, ఉన్నతమైన ఉద్యోగాలను,పొంది ఉన్నతంగా బ్రతికే అవకాశం ఉంటుందని అన్నారు.పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నారుల నృత్య నాట్య ప్రదర్శనలతో, మంత్రముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పుర ప్రముఖులు, విద్యార్థుల సంరక్షకులు, విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు. తదితరులు పాల్గొన్నారు.
