Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

స్వాతంత్ర ఉద్యమకారుడు, భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు మునగాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మాట్లాడుతూ.. 27 సంవత్సరాల వయసులోనే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించిన ఘనత బాబు జగ్జీవన్ రామ్ ది అని,దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి అని,భారతదేశ అమూల్య రత్నం గా పిలవబడే ఘనత జగ్జీవన్ రామ్ ది అని అన్నారు.జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయాలతో జగ్జీవన్ రామ్ ఎక్కువగా ఏకీభవించేవారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి గాంధీ చేసిన ప్రయత్నాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారు. బాబూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ.. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.