

జనం న్యూస్// ఏప్రిల్// 5// కుమార్ యాదవ్ // జమ్మికుంట
జమ్మికుంట గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు పైడిపల్లి సురేష్ ప్రమాదవశాత్తు మరణించడంతో సురేష్ తండ్రి పైడిపల్లి సమయ్య కు లక్ష రూపాయల చెక్కు వరగంటి రవి అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. మధ్యతరగతి వ్యాపార, ఉద్యోగ, వర్గ ప్రజలకు గాయత్రి బ్యాంకు వారు, రుణాలు ఇస్తున్నారని, నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల ప్రమాద బీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు.గాయత్రి బ్యాంకు ఖాతాదారులకు ప్రమాద బీమా కింద లక్ష రూపాయలు అందిస్తుందని సిఐ తెలిపారు