

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్//జమ్మికుంట..
దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో వ్యక్తం చేసిన అభిప్రాయాల కనుగుణంగా జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్ లో రైతు సంఘాల నేతలు,మేధావులతో సదస్సు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు శుక్రవారం ఇక్కడ సమాఖ్య కార్యాలయంలో వెల్లడించారు. పారిశ్రామీకరణ పెరిగి వ్యవసాయం అంటరాని వృత్తిగా మారడం, రైతులకు చిన్న చూపు చూడడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగాలంటే వారికి అన్ని శాఖల్లో రిజర్వేషన్లు కల్పించాలని, లేకుంటే సంపన్నుల ఆధిపత్యంలోనే వ్యవస్థలు ఉండిపోయి కర్శకులకు న్యాయం జరగదని జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ చర్చలు జరుగుతున్నాయని ఇది శుభ పరిణామమని పోలాడి రామారావు పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా రైతులకు అన్ని రంగాల్లో తగిన గుర్తింపు కోసం ప్రత్యేక రిజర్వేషన్ల అమలుకు రాజకీయాల కతీతంగా రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్ష్య సాధనకు దీర్ఘ కాలిక ఉద్యమాన్ని నిర్మిస్తామని పోలాడి రామారావు ప్రకటించారు.
తాము చేపట్ట బోయే ఉద్యమ పంథా దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించబోతుందని ఇది రైతన్నలు, రైతు కూలీలు అభ్యున్నతి కి నవ శకానికి నాంది పలికుతుందని రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు.