Listen to this article

కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ 117వ జయంతి సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారన్నారు… అనంతరం పట్టణంలోని చర్చి సెంటర్ వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ విగ్రహానికి లమాలవేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు ఘన నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, బిజెపి నాయకులు ఘట్టమనేని హరిబాబు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, గోచిపాతల మోషే, రెబ్బవరపు మాల్యాద్రి, బద్దిపూడి శికామణి, గురజాల బెంజిమెన్, పులి నాగరాజు, చనమాల శ్రీధర్, పాలేటి కోటేశ్వరరావు, మట్టిగుంట శీను, కావలి ఏసుదాసు, దార్ల సుబ్బారావు, లింగాబత్తిన మాల్యాద్రి, చేవూరి రమేష్ బాబు, అక్కిలగుంట ఆశీర్వాదం, గోచిపాతల ప్రసాదు, జడ రవీంద్ర, మెండా లెనిన్ బాబు, ఎండ్లూరి పుల్లయ్య చదలవాడ ఇమ్మానియేలు, ఉచ్చులూరి సుబ్బారావు మరియు పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్, వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, అత్తంటి శ్రీహరి నాయుడు, షేక్ మున్నా, షేక్ సలాం, చుండూరి శ్రీనివాసరావు, మూసా, కల్లూరి శైలజ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు…